
‘అకాడి’ పూజలు
జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామంలో శుక్రవారం ప్రజలు అకాడి పండుగ సందర్భంగా వనదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాకాలంలో మేతకు వెళ్లే పశువులకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం వనదేవతలకు పూజలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. అకాడి పూజల అనంతరం ఏత్మాసూర్ దేవతకు పూజలు చేయనున్నారు. ఆ తర్వాత దండారీ ఉత్సవాలకు శ్రీకారం చుడతామని వావుదాం పటేల్ సీలిక్‌రావు తెలిపారు. కార్యక్రమంలో భగవంత్‌రావు, ధర్మరావు, లింబారావు తదితరులు పాల్గొన్నారు.
– ఆసిఫాబాద్‌రూరల్