గుడుంబా కిక్కు..! | - | Sakshi
Sakshi News home page

గుడుంబా కిక్కు..!

Jun 25 2025 6:58 AM | Updated on Jun 25 2025 6:58 AM

గుడుం

గుడుంబా కిక్కు..!

కౌటాల(సిర్పూర్‌): జిల్లాలో బెల్టు దుకాణాలకు తోడు.. గుడుంబా గుప్పుమంటోంది. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అలసత్వంతో యథేచ్ఛగా తయారీ చేస్తున్నారు. మత్తుకు బానిసలుగా మారినవారు తక్కువ ధరకు లభించే దేశీదారుతోపాటు నాటుసారా తాగేస్తున్నారు. జిల్లాలో వందశాతం గుడుంబా అమ్మకాలు నిర్మూలించామని అధికారులు చెబు తున్నా.. గ్రామాల్లో గుట్టుగా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నాయి. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం సాగుతుండటంతో మహారాష్ట్రకు సరిహద్దు గ్రామాల శివారులో కొత్తగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆడపాదడపా కేంద్రాలపై దాడులు చేస్తున్నా పూర్తిస్థాయిలో నిర్మూలనకు అడుగులు పడటం లేదు.

బైకులపైనే తరలింపు..

మారుమూల గ్రామాల్లో అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా అక్రమార్కులు కాసుల కోసం ప్రాణహి త, వార్దా, పెద్దవాగు, పెన్‌గంగ నదులతోపాటు పంట పొలాల్లోని వ్యవసాయ బావులు, వాగులు, అటవీ ప్రాంతాలకు సమీపంలో చేలలో గుడుంబా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఇళ్లనే స్థావరాలుగా మార్చుకుంటున్నారు. నాటుసారాను ప్యాకెట్లుగా మార్చి పోలీసుల కళ్లుగప్పి ఇతర గ్రామాలకు బైక్‌లపైనే తరలిస్తున్నారు. కిరాణ దుకాణాల వద్ద కూడా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో గత ఐదు నెలల్లో ఏడు మండలాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి పోలీసులు 206 కేసులు నమోదు చేశారు. 223 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. 1,163 లీటర్ల గుడుంబా, 2060 కిలోల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా రవాణా చేస్తున్న 20 వాహనాలను పట్టుకున్నామని ఆబ్కారీశాఖ అధికారులు వెల్లడించారు.

అమలు కాని నిషేధం

రాష్ట్రంలో గుడుంబాను ప్రభుత్వం నిషేధించింది. అయితే తయారీదారులు, బెల్లం విక్రయదారులపై కఠిన చర్యలు లేకపోవడం, కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. నాటుసారాకు వినియోగించే బెల్లంపై కూడా రాష్ట్రంలో నిషేధం ఉంది. అయితే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఈ నల్ల బెల్లంపై నిషేధం లేదు. అక్రమార్కులు ఆ జిల్లా నుంచి కాగజ్‌నగర్‌, కౌటాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. అలాగే బల్లార్షాలో కిలో బెల్లాన్ని రూ.50కి కొనుగోలు చేసి వాంకిడి, సిర్పూర్‌(టి) మండలాల మీదుగా కౌటాల ప్రాంతానికి అక్రమంగా చేరవేస్తున్నారు. ఇక్కడ కిలో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖల అధికారులు స్పందించి గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

కేసులు నమోదు చేస్తున్నాం

జిల్లాలో నదుల సమీపంతో పాటు వ్యవసాయ చేలు, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు ఏ ర్పాటు చేసినట్లు సమాచా రం రాగానే ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. నిత్యం తనిఖీలు చేసి స్థావరాలపై ఉక్కుపాదం మోపుతాం. అక్రమంగా మద్యం అమ్ముతున్న వారి వివరాలు పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులకు తెలియజేయాలి.

– వి.రవి, ఎకై ్సజ్‌ శాఖ సీఐ, కాగజ్‌నగర్‌

ఇటీవలి ఘటనలు

బెజ్జూర్‌ మండలం లంబాడిగూడ సమీపంలో గుడుంబా స్థావరంపై ఏప్రిల్‌ 25న ఎకై ్సజ్‌ శాఖ పోలీసులు దాడులు చేశారు. లంబాడిగూడకు చెందిన బానోత్‌ హరిప్రసాద్‌, నాగుత్‌ విజయ్‌ నాటుసారా తయారు చేస్తుండగా పట్టుకుని వంద లీటర్ల బెల్లం పానకం పారబోశారు.

బెజ్జూర్‌ మండలం సులుగుపల్లి గ్రామానికి చెందిన అవధూత సత్యనారాయణ కిరాణాషాపులో ఏప్రిల్‌ 25న దాడులు నిర్వహించగా, 75 కిలోల బెల్లం, 20 కిలోల పటిక లభ్యమైంది.

ఈ నెల 1న దహెగాం మండలం మర్రిపల్లి శివారులో గుడుంబా స్థావరాలపై పోలీ సులు దాడులు చేశారు. తయారీకి విని యోగించే వంద లీటర్ల బెల్లం పానకం పారబోశారు.

కౌటాల మండలం ముత్తంపేటలో ఈ నెల 23న నాటుసారా తయారీకి వినియోగించే 1.60 క్వింటాళ్ల బెల్లం, 80 కిలోల పటికను ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో గుప్పుమంటున్న వైనం

ప్యాకెట్లుగా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా

స్థానిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు!

మారుమూల ప్రాంతాల్లో కేంద్రాలు..

జిల్లాలో ఏటా మద్యం వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు పెంచడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనుండడంతో గుడుంబా విక్రయా లూ పెరుగుతున్నాయి. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, దహెగాం, సిర్పూర్‌(టి), పెంచికల్‌పేట్‌ తదితర మండలాలకు సులు వుగా బెల్లం సరఫరా అవుతోంది. మహారాష్ట్రతోపాటు మంచిర్యాల, కాగజ్‌నగర్‌ పట్టణా ల నుంచి నల్ల, తెల్ల బెల్లం, పటిక తరలించి గుడుంబా తయారు చేస్తున్నారు. కౌటాల మండలం కన్నెపల్లిలో మద్యం ఏరులై పారుతుండడంతో గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్లు ఇటీవల మహిళలు తీర్మానం చేశారు.

గుడుంబా కిక్కు..!1
1/1

గుడుంబా కిక్కు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement