
విచారణ వేగంగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా హాట్‌స్పాట్ల ను గుర్తించి గంజాయి రవాణా, సేవించే వ్యక్తులను గుర్తించాలన్నారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణూమూర్తి పాల్గొన్నారు.
చెక్కు అందజేత
కాగజ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ గతేడాది ఏప్రిల్ 11న గుండెపోటుతో మృతి సిర్పూర్(యూ)కు చెందిన మడావి ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో చెక్కు అందించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8లక్షల విలువైన చెక్కును కానిస్టేబుల్ సతీమణి గంగామణికి అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, సిబ్బంది విజయ శంకర్‌రెడ్డి, పెద్దన్న, శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.