సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలేవి..?
లోక్‌సభలో ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: రైతులు తమ పంటచేలల్లో రసాయనిక ఎరువుల వినియోగాని కి బదులుగా సేంద్రియ సాగును ప్రోత్సహించేలా బయో ఇన్‌పుట్ రీ సెర్చ్ సెంటర్ల (బీఆర్సీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాల్సిందిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఈ అంశా న్ని ప్రస్తావిస్తూ.. పరిశోధన కేంద్రాల పురోగతి వివరాలు తెలపాలన్నారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రాల్లో 3,517 బీఆర్సీలు.. ఖమ్మం జిల్లాలో ఆరు ఏర్పాటయ్యాయని తెలిపారు. క్లస్టర్ స్థాయి సంస్థగా.. రైతులకు ప్రత్యేక శిక్షణ, ప్రదర్శనలు ఉంటాయని, సొసైటీలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహా యక బృందాలతో ఈ బీఆర్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతులను మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
తల్లాడ: మండలంతోపాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పత్తి కొనుగోలు కాంటాల్లో నకిలీ చిప్‌లను పెట్టి రైతులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ వివరాలు వెల్లడించారు. నకిలీ చిప్‌లను ఉపయోగించి డిజిటల్ కాంటాలను తయారు చేస్తున్న హైదరబాద్‌కు చెందిన ఓగిలిశెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 5 మదర్‌బోర్డులు (పీసీబీ) నాలుగు చిప్‌లు, రెండు కాంటాలు, వస్తువులను సీజ్ చేశామని చెప్పారు. వారిని పట్టుకున్న ఎస్‌ఐ వెంకటకృష్ణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ముగిసిన ఉపసంహరణ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. మొత్తంగా 192 సర్పంచ్ స్థానాలకు 438 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 1,740 వార్డు స్థానాలకు గాను 536 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.. మిగతా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ ఎన్నికలకు సంబంధించి 183 సర్పంచ్ స్థానాలకు గాను 1055 నామినేషన్లు దాఖలు కాగా... పరిశీలన అనంతరం 894 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 1686 వార్డు స్థానాలకు గాను 4160 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన అనంతరం 4047 నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన వివరాలు లేని వాటిని అధికారులు తిరస్కరించారు. 3వ విడత 191 సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 90 నామినేషన్లు దాఖలు అయ్యా యి. 742 వార్డు స్థానాలకు 237 నామినేషన్లు దాఖలైనట్లు అదనపు ఎన్నికల అధికారి ఆశా లత తెలిపారు. ఈ మూడు విడతలకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఇది లా ఉండగా చివరి విడత బుధ, గురువారాల్లో నామినేషన్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇళ్ల తలుపులు దహనం
గుర్తుతెలియని దుండగుల దుశ్చర్య
ఖమ్మంక్రైం: నగరంలోని టూటౌన్ పరిధి లో గుర్తుతెలి యని దుండగు డు ఇంట్లోవా రు నిద్రిస్తున్న సమయంలో తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించా డు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. రాపర్తినగర్‌లోని బీసీకాలనీలో నివాసం ఉండే ఎల్లయ్య కుటుంబం ముగ్గు విక్రయిస్తూ జీవిస్తోంది. అతని కుమారుడు నాగేశ్వరరావు ఆటోనడుపుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు.. తన ఇంటి ముందు తలుపులు తగలబడిపోతుండటం గమనించాడు. కేకలు వేసి, ఇంట్లో నిద్రిస్తున్న భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను లేపి, మంటలను ఆర్పివేశాడు. నాగేశ్వరరావు రాకను గమనించిన దుండగుడు పరారయ్యాడు. అతడి చెప్పులు అక్కడే వదిలిపెట్టాడు. తలుపుల వద్ద ఓ పట్టా ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తించారు. నాగేశ్వరరావు ఆ సమయానికి రాకుంటే ఇంట్లోని వారు సజీవ దహనమయ్యేవారు. పోలీసులు అన్ని కోణా ల్లో విచారిస్తున్నారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలేవి..?
సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలేవి..?


