అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు
కామేపల్లి: మండలంలోని పలు గ్రామాలు ఏకగీవ్రం దిశగా అడుగులు వేయగా వాటిలో పాతలింగాల, లాల్యతండా సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. పాతలింగాల 2019 ఎన్నికల్లో ఎస్టీ జనరల్ కావడంతో గ్రామానికి చెందిన కిన్నెర నాగయ్యను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళ కావడంతో నాగయ్య భార్య కిన్నెర సుజాతను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో లాల్యతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కావడంతో గ్రామానికి చెందిన మాలోత్ రాంచందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాంచందర్ భార్య సౌజన్యను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
కారేపల్లి: నామినేషన్‌ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా సూచించారు. బుధవారం సింగరేణి మండలంలోని సింగరేణి, భాగ్యనగర్‌తండా, సీతారాంపురం, కోమట్లగూడెం గ్రామాల్లో నామినేషన్ రిసీవింగ్ కేంద్రాలను దీక్షరైనా పరిశీలించారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లేల రవీంద్రప్రసాద్, ఎస్‌ఐ బి.గోపి ఉన్నారు.
అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు
అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు


