ముహూర్తం చూసుకుని..
సత్తుపల్లి: పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పేరు బలంతో ముహూర్తాలు చూసుకుంటున్నారు. తొలి రోజు బుధవారం త్రయోదశి కావటంతో నామినేషన్లు అంతగా వేయలేదు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి కావటంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది.
43 క్లస్టర్లు.. 130 పంచాయతీలు
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 130 పంచాయతీలు, 1,208 వార్డులను 43 క్లస్టర్లుగా విభజించి నామినేషన్ల స్వీకరణ చేపడుతున్నారు. 128 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తల్లాడ మండలంలో బస్వాపురం పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం చేసుకునేందుకు మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. పెనుబల్లి మండలం గౌరారం పంచాయతీ ఎన్నికపై కోర్టును ఆశ్రయించటంతో నిలిచిపోయింది.
అభ్యర్థుల ప్రకటనలతో..
నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావటంతో మండలాల వారీగా అభ్యర్థులను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రకటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటనతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. కొన్నిచోట్ల పార్టీలు నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తొలిరోజు
నామినేషన్లు నామ మాత్రమే


