
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదాలు, ఉత్సవ మూర్తులకు వేదమంత్రాల నడుమ పంచామృతాభిషేకం గావించారు. అనంతరం శ్రీ వారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె. జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో జరిగే సమావేశంలో పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అలాగే, చుంచుపల్లి మండలం ధన్‌బాద్‌లోని మాయాబజార్, వనమాకాలనీ వాసులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం వద్ద సీతారాపురం–రూప్లాతండా రహదారిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం 6గంటలకు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి.. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాక సుర్దేపల్లిలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
డీసీఈబీ సెక్రటరీగా
బాధ్యతల స్వీకరణ
ఖమ్మం సహకారనగర్ : డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా చింతకాని మండలం నాగులవంచ హెచ్‌ఎం కనపర్తి వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను వివిధ సబ్జెక్టుల డీఆర్పీలతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, దామోదర ప్రసాద్, సుబ్బారావు, డీసీఈబీ మాజీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో మేయర్,
డిప్యూటీ మేయర్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం అమృత్ పథకంపై చర్చల అనంతరం కొత్త, పాత పార్లమెంట్ భవనాలను ఇతర పట్టణాల మేయర్లతో కలిసి సందర్శించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు