
అటవీ ప్లాంటేషన్‌లో సాగుకు యత్నం
కారేపల్లి: మండలంలోని మాణిక్యారం–ఎర్రబోడు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వేసిన ప్లాంటేషన్‌లో సాగుకు యత్నించిన వారిని ఉద్యోగులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు – పోడుదా రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈసందర్భంగా పోడుదారులు మాట్లాడుతూ ఏళ్లుగా తాము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుండగా, రెండేళ్ల క్రితం అధికారులు ప్రత్యామ్నాయంగా భూమిఇస్తామని నమ్మించి ప్లాంటేషన్‌వేశారని తెలిపారు.ఇప్పుడు దాట వేత ధోరణి అవలవంబిస్తుండడంతో కుటుంబపోషణ భారమై సాగుకు సిద్ధమయ్యాయని చెప్పారు. కాగా, ఎఫ్‌డీఓ వెంకన్న చేరుకుని రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఎఫ్‌ఆర్‌ఓ ప్రడూస్, సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డుకున్న ఫారెస్టు అధికారులు