
లిఫ్ట్ ఇరిగేషన్ లతో పుష్కలంగా సాగునీరు
కల్లూరురూరల్: లిఫ్ట్ ఇరిగేషన్లతో పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శనివారం ఆయన లింగాలలో విలేకరులతో మాట్లాడారు. లిఫ్ట్‌లకు మరమ్మతులు అవసరమైతే నిధుల కోసం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు నీరు అందుతుందన్నారు. రైతుబంధుతో పాటు సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు మట్టూరి జనార్దన్, మద్దినేని లోకేశ్వరరావు, యాస వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్‌కుమార్, యాస శ్రీకాంత్, తాళ్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.