జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరం

Jul 6 2025 7:06 AM | Updated on Jul 6 2025 7:06 AM

జూనోస

జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరం

● సాధు జంతువుల నుంచి సంక్రమణ ● వైరస్‌, బ్యాక్టీరియాల ద్వారా వ్యాప్తి ● రేబిస్‌, మెదడువాపు, ఆంత్రాక్స్‌ వంటివి ప్రాణాంతకమంటున్న వైద్యులు
నేడు ‘జూనోసిస్‌ డే’

ఖమ్మంవ్యవసాయం: జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరమైనవి. పశువుల నుంచి మాన వులకు, మానవుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావమున్న వ్యాధులను జూనోసిస్‌ వ్యాధులు అంటారు. ఇవి మరణాలకు కూడా దారితీస్తాయి. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చ ర్‌ పిచ్చికుక్క కాటుతో వచ్చే వ్యాధి రేబిస్‌ నివారణ కు రేబిస్‌ టీకాను కనుగొన్నాడు. కుక్క కాటుకు గురైన బాలుడు జోసెఫ్‌ మీస్టర్‌పై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రేబిస్‌ సోకకుండా ముందుగా యాంటీ రేబిస్‌ టీకాను ఇస్తారు. ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పాలు, మాంసం, గుడ్ల కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతున్నాడు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపు డు జంతువుల వలన కూడా మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. జూనోసిస్‌ వ్యాధు ల రకాలు, వాటి నివారణ గురించి ఖమ్మం పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ అరుణ వివరించారు.

కారకాలు..

బ్యాక్టీరియా: ఆంత్రాక్స్‌, బ్రూసెల్లోసిస్‌ లెప్టోస్పై రోసిస్‌, క్షయ

వైరస్‌: రేబిస్‌, బర్డ్‌ఫ్లూ, మెదడువాపు, సార్స్‌, మేడ్‌కౌడిసీజ్‌

ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా, లీష్‌మెనియాసిస్‌

రెకెట్షియా: టిక్‌, టైఫస్‌, క్యూఫీవర్‌

హెల్మెంథ్స్‌: ఎకై నోకోకోసిస్‌, టీనియాసిస్‌

ఎక్టోపారాసైట్స్‌: స్కేజిస్‌

రేబిస్‌: ఇది పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్‌’ వైరస్‌ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకి నా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

●మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు.

●ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు.

●దాహం వేస్తున్నా నీళ్లు తాగమంటే భయపడతాడు.

నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆభాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలి.

బర్డ్‌ప్లూ వ్యాధి: బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్‌తో కలిగే వ్యాధి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవులకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా ఇంతవరకు కనుగొనలేదు.

మెదడువాపు: వ్యాధి కారక వైరస్‌లు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి.

ఆంత్రాక్స్‌: ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకి న మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది.

బ్రూసెల్లోసిస్‌: ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్‌ బూసెల్లా మెలిటెన్సిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి మనుషులు, అన్నిజాతుల పశు వులకు సోకుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా, ట్యూబర్‌క్యులోసిస్‌తో క్షయ, లెప్టాస్పై రా ఇక్టిరోహి యో రెజికా బ్యాక్టీరియాతో లెప్టోస్పైరోసిస్‌ వ్యాధు లు వ్యాపిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

జూనోసిస్‌ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.

వీధి కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి.

పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జూనోసిస్‌ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి.

జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరం1
1/1

జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement