
వీడియో కాల్ చేసి.. ఆత్మహత్య
● సహజీవనంలో విషాదం
యశవంతపుర: నేటి రోజుల్లో సహ జీవనం వెంట పరుగులు తీస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా విరాజపేటలో జరిగింది. వివరాలు.. స్థానిక గాంధీనగరలో ఉండే సాగర్ (30) కరెంటు స్తంభాలను నాటే పని చేస్తున్నాడు. ఆటో కూడా నడిపేవాడు. ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు. అతడు తరచూ మద్యం తాగి రావడంతో ఆమె గొడవ పడేది. రెండు రోజుల క్రితం ఇలాగే పోట్లాట జరిగింది. ఊరికి వెళ్లివచ్చిన సాగర్ మహిళ లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించలేదు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ప్రియురాలు దూరమైపోతుందనే భయంతో వీడియో కాల్ చేసి ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించినా పట్టించుకోలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కొడుకు ఇంటికి రాగా సాగర్ శవమై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.