
మూడో రోజున 75 ఆటోలు సీజ్
రాయచూరు రూరల్: నగరంలో మూడవ రోజున కూడా తనిఖీ చేసి 75 ఆటోలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్‌సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి అనుమతులు లేని వాటిని తనిఖీ చేశామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు బీమా ఇతర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.50 వేలు వసూలు చేశామన్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో దాఖలాలు పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు.