
సీఎం నచ్చజెప్పడంతో విధులకు హాజరు
హుబ్లీ: వీఆర్‌ఎస్ కోరుతూ సమర్పించిన ధార్వాడ ఏఎస్పీ నారాయణవీ భరమనికి సీఎం ఫోన్ చేసి నచ్చజెప్పడంతో గురువారం ధార్వాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని తన కార్యాలయంలో యథావిధిగా విధులకు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడతో చర్చించిన తర్వాత తన కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన భావనలను తన సీనియర్ అధికారులకు తెలియజేశాను. సీనియర్ అధికారులు కూడా తనతో మాట్లాడారు. తాను క్రమశిక్షణ కలిగిన శాఖలో ఉన్నాను. సీఎం, హోం మంత్రి తనతో మాట్లాడారు. తాను ఎప్పుడూ కూడా మీడియాతో మాట్లాడలేదు. విధులకు హాజరవుతున్నానన్నారు. కాగా ఆయనకు ఫోన్ చేసిన సీఎం వీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని వాపస్ తీసుకోండి. తాను ఆ రోజు ఉద్దేశ పూర్వకంగా ఆ విధంగా నడుచుకోలేదు. మిమ్మల్ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం తనకు లేదని ఏఎస్పీకి నచ్చజెప్పారు. కాగా ఈ ఘటనపై విధాన సౌధలో ఎమ్మెల్యే అశోక్ పఠాన్ మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య ఆయన్ను కొట్టడానికి ప్రయత్నించలేదు. మనిషి అన్న తర్వాత సహజంగానే కోపం వస్తుంది అంతే.. అంటూ ఘటనను సమర్థించుకున్నారు.
వీఆర్‌ఎస్ నిర్ణయం మార్చుకున్న
ఏఎస్పీనారాయణ భరమని