
ఆస్పత్రి ఉన్నా వైద్యులు లేరన్నా.!
రాయచూరు రూరల్: రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వారికి వైద్యం, ఆరోగ్యం లభించడం మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా మారింది. రాయచూరు నుంచి 15 కి. మీ.దూరంలో ఉన్న ఉడుంగల్ ఖానాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. అయితే విధులు మాత్రం ఇద్దరే నిర్వహిస్తున్నారు. 24 గ్రామాల ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు కల్పించాల్సిన వైద్యులు, సిబ్బంది విధులకు రాకుండా చక్కర్లు కొడుతున్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, అతిసార వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న తరుణంలో వైద్యులు తమకేమీ పట్టనట్లు సొంత పనుల్లో మునిగారు. ఉడుంగల్ ఖానాపుర ఆస్పత్రిలో 19 మంది ఉండగా, ఆరుగురు ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 10 మంది సొంత పనుల్లో జిల్లా కేంద్రంలో ఉంటారు. వైద్యులు 15వ తేదీ నుంచి విధులకు గైర్హాజరయ్యారు. ప్రతినిత్యం 40 మందికి పైగా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. అయినా రోగులకు ఇంతవరకు ఆస్పత్రిలో డాక్టర్ ఎవరో తెలియదని గ్రామస్తులు వాపోయారు.
24 గ్రామాల ప్రజలకు అందని వైద్యం
విధులకు వైద్యులు, సిబ్బంది డుమ్మా

ఆస్పత్రి ఉన్నా వైద్యులు లేరన్నా.!