
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని జాయింట్ కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్టుగా వేతనాలు, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి చెప్పి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మాని పెంచిన ధరలను తగ్గించాలన్నారు.