రచ్చకెక్కిన వీధి గొడవ | - | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన వీధి గొడవ

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 9:05 AM

రచ్చక

రచ్చకెక్కిన వీధి గొడవ

యశవంతపుర: సిలికాన్‌ సిటీలో వీధి గొడవ ఇప్పుడు మరో చర్చనీయాంశమైంది. వింగ్‌ కమాండర్‌ శిలాదిత్య గుప్తా వీడియోలో చెప్పినదానికి, బయట సీసీ కెమెరాల ద్వారా వెల్లడైనదానికి పొంతన లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బైయప్పనహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ దాడి కేసుకు సంబంధించి రెండు వైపులా విచారణ చేస్తున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమీషనర్‌ బీ దయానంద తెలిపారు. వీడియోల ఆధారంగా అధిక సమాచారం సేకరిస్తామన్నారు. వింగ్‌ కమాండర్‌ చెబుతున్న మాటల్లో అనేక వ్యత్యాసాలున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

నా కొడుకునే కొట్టారు: బైకిస్టు తల్లి

ఈ గొడవలో పోలీసులు అరెస్ట్‌ చేసిన యువకుడు వికాస్‌ తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుది ఎలాంటి తప్పు లేదని చెప్పారు. వికాస్‌ బైకు సైలెన్సర్‌, కారుకు టచ్‌ అయింది. వారు హిందీలో తిట్టారు. హిందీ అర్థం కాలేదని వికాస్‌ బదులిచ్చాడు, వింగ్‌ కమాండర్‌ కారు దిగి వికాస్‌ను తోసివేసి చేతిని కరిచి, శరీరాన్ని బరికాడు. బైకును ఎత్తిపడేసి కాళ్లతో తన్నాడు. పైగా మాదే తప్పని అంటున్నాడు. వింగ్‌ కమాండర్‌ను కూడా అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. పైగా జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడని సోషల్‌ మీడియాలో వింగ్‌ కమాండర్‌ వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వింగ్‌ కమాండర్‌ యువకునిపై పదేపదే దాడి చేసిన దృశ్యాలు, మొబైల్‌ని విసిరిపారేయడం సీసీ కెమెరాలలో రికార్డయింది. వింగ్‌ కమాండర్‌ ప్రవర్తనపై కన్నడ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. దాడి చేసింది కాక ఆరోపణలు చేస్తున్నాడని తప్పుబట్టాయి.

దాడి చేస్తున్న దృశ్యం

వింగ్‌ కమాండర్‌, బైకిస్టులో

ఎవరిది తప్పు?

వీడియోలు, సీసీ కెమెరాలలో

తలోరకం దృశ్యాలు

విచారణ జరుపుతున్నాం:

పోలీస్‌ కమిషనర్‌

రచ్చకెక్కిన వీధి గొడవ 1
1/1

రచ్చకెక్కిన వీధి గొడవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement