థగ్‌ లైఫ్‌కు రూ.35 కోట్ల నష్టం? | - | Sakshi
Sakshi News home page

థగ్‌ లైఫ్‌కు రూ.35 కోట్ల నష్టం?

Jun 8 2025 12:58 AM | Updated on Jun 8 2025 12:58 AM

థగ్‌

థగ్‌ లైఫ్‌కు రూ.35 కోట్ల నష్టం?

కన్నడనాట సినిమా ఆడని వైనం

కమల్‌– కన్నడ వివాద ఫలితం

సాక్షి, బెంగళూరు: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే ఒకే ఒక్క మాటతో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తన మాటలపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించడంతో మరింతగా కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. దీని ఫలితం కమల్‌ హాసన్‌ నటించి, నిర్మించిన థగ్‌ లైఫ్‌ సినిమా మీద పడింది. ఆ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల సుమారు రూ. 35–40 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు తెలిసింది.

7 శాతం రాబడి పోయినట్లే

సినీ నిర్మాత, పంపిణీదారుడు జి.ధనంజయన్‌ లెక్కల ప్రకారం కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు అవకాశం లేకపోవడంతో సుమారు రూ. 35–40 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఇందులో నిర్మాత షేర్‌ రూ. 12–15 కోట్ల పైమాటేనని ఆయన తెలిపారు. ఇతర పరభాషా చిత్రాలు కన్నడనాట భారీ వసూళ్లను రాబట్టాయి. కమల్‌ హాసన్‌ థగ్‌లైఫ్‌ సినిమాకు కర్ణాటకలో మంచి డిమాండ్‌ ఏర్పడింది. మణిరత్నం–కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌ కాబట్టి ఆసక్తి నెలకొంది. అలా మంచి ఓపెనింగ్స్‌ వచ్చేవని ఆయన తెలిపారు. మొత్తం సినిమా ఆదాయంలో 7 శాతాన్ని కన్నడ వివాదం వల్ల నష్టపోవాల్సి వచ్చింది.

అంతా సిద్ధమైన సమయంలో..

వాస్తవానికి కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సినిమాను కర్ణాటకలో పంపిణీదారుడు వెంకటేశ్‌ సుమారు రూ. 8.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 200 థియేటర్లలో సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలకు నాలుగైదు రోజుల ముందు కమల్‌హాసన్‌ చేసిన ప్రకటన పరిణామాలను మార్చేసింది. సినిమా తొలిరోజు సుమారు రూ. 4 నుంచి రూ 5 కోట్ల మేర, రెండోరోజు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల మేర ఆదాయం దూరమైనట్లు అంచనాలున్నాయి

థగ్‌ లైఫ్‌కు రూ.35 కోట్ల నష్టం? 1
1/1

థగ్‌ లైఫ్‌కు రూ.35 కోట్ల నష్టం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement