నల్లా కనెక్షన్ల ఫిర్యాదుకు ప్రత్యేక కౌంటర్
కరీంనగర్ కార్పొరేషన్: నల్లాల సర్వే నగరంలో జరుగుతున్న క్రమంలో ప్రజల నుంచి వస్తున్న సందేహాలు, ఫిర్యాదుల కోసం నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఇన్‌వార్డులో ప్రత్యేకంగా కౌంటర్‌ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్‌సిటీ పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న నల్లా కనెక్షన్ల సర్వేను మరింత వేగవంతం చేయాలన్నారు. డీఈ స్థాయి అధికారి నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌లు నల్లాల ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. స్మార్ట్‌సిటీ పనులను తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీలలోగా పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.స్వచ్ఛ భారత్ మిషన్‌కు సంబంధించిన పనులను ప్రాధాన్యతగా తీసుకొని వెంటనే చేపట్టాలన్నారు. అక్రమ విద్యుత్ వినియోగాన్ని నిర్మూలించడానికి విద్యుత్ మీటర్ల సర్వే చేయాలన్నారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, శివానందం, డీఈలు దేవేందర్, లచ్చిరెడ్డి, అరుణ్, వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, ఏఈలు పాల్గొన్నారు.


