
కొత్త విద్యా సంవత్సరం.. కొత్త బంగారు లోకం
సుల్తానాబాద్(పెద్దపల్లి): కొత్త విద్యా సంవత్సరం ఈనెల 12న ప్రారంభమైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఈడీ తదితర కోర్సుల్లోనూ అడ్మిషన్ తీసుకుంటున్నారు. మరికొందరు హాస్టల్లోనూ చేరుతున్నారు. ఇంకొందరు స్నేహితులతో కలిసి గదులు అద్దెకు తీసుకుని వివిధ కళాశాలలకు వెళ్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు కొందరు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా అమ్మానాన్నతో గడిపిన విద్యార్థులు.. ఇక బ్యాచ్‌లర్‌గా జీవితం గడిపేందుకు సన్నద్ధమయ్యా రు. ఇలాంటి వారికి గదులు అద్దెకు ఇచ్చేందుకు ఇళ్ల యజమానులు సుముఖత చూపడంలేదు.
కుటుంబం పరిస్థితితో అడుగులు వేయాలి
కోర్సులు చేరిన వారు ఎవరైనా.. ఏ కోర్సులో ప్రవే శం పొందాలన్నా.. ట్యూషన్ ఫీజులు, బుక్స్, ప్యాకె ట్ మనీ, హాస్టల్ బిల్లులు, ప్రైవేట్ గదుల అద్దె చెల్లించడం తదితర వాటికి కుటుంబం ఆదాయంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చూసి విద్యార్థులు నడుచుకోవాల్సి ఉంటుంది. కొందరు కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూసి పార్ట్‌టైం జాబ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరికొందరు ట్యూషన్ చెప్పేందుకు వెళ్తున్నారు.
అనేక ఆలోచనలతో ఇంటర్‌లో ప్రవేశాలు