
చలాన్లు వేస్తున్నారు
జమ్మికుంటలో పార్కింగ్ స్థలాలు లేవు. పనుల నిమిత్తం పట్టణానికి వస్తే రోడ్డుపై వాహనం పెట్టాల్సి వస్తోంది. పోలీసులు ట్రాఫిక్ నిబంధనల కింద చలాన్లు వేస్తున్నారు. ఫైన్ కట్టలేని పరిస్థితి ఉంది. పట్టణంలో పార్కింగ్ సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది.
– గాదె గుణసాగర్, జమ్మికుంట
ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తాం
జమ్మికుంట పట్టణంలో రాకపోకలకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ సమస్యలను పరిగణంలోకి తీసుకుంటాం. ఈ విషయమై ఇతరశాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ నియంత్రణపై సయుక్త పరిశీలన చేసి సమస్యను పరిష్కరిస్తాం.
– రామకృష్ణ, సీఐ, జమ్మికుంట టౌన్
ఆక్రమణలు తొలగిస్తాం
జమ్మికుంట పట్టణంలో రో డ్డుకు ఇరువైపుల నిబంధనలు పాటించని అక్రమణల ను తొలిగిస్తాం. బ్రిడ్జి కింద వ్యాపారుల అక్రమణలపై చర్యలు తీసుకుంటాం. నిజ మైన ఉపాధి కోసం చూస్తున్న చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించేందుకు ప్ర యత్నిస్తాం. – ఎండీ అయాజ్,
మున్సిపల్ కమిషనర్, జమ్మికుంట

చలాన్లు వేస్తున్నారు

చలాన్లు వేస్తున్నారు