
కిడ్నీతో పునర్జన్మ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అమ్మ కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ఇస్తే.. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన నాగరాజు పేర్కొన్నాడు. వివరాలు.. వెల్ది సరోజన– రాజమల్లు దంపతుల పెద్ద కుమారుడు నాగరాజు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఆర్థిక స్థోమత లేక కొన్నాళ్లు మందులతో నెట్టుకొచ్చారు. అప్పుడే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి వరంగా మారింది. తల్లి సరోజన కిడ్నీ ఇవ్వడంతో నాగారాజు పూర్తిగా కోలుకున్నాడు.
ఆరోగ్యశ్రీ కాపాడింది
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాకు దేవుడు. మా కొడుకు ద క్కడని అనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకం ఆపరేషన్‌కు దారి చూపింది. నేను కిడ్నీ ఇచ్చి కొడుకును బతికించుకున్నా. ఆ దేవుడికి రుణపడి ఉన్నాం. కొడుక్కు పెండ్లి చేశాం. భార్యాపిల్లలతో ఆనందంగా ఉన్నారు. – సరోజన, నాగరాజు తల్లి
మందులు వాడుతున్న
రోజూ మందులు వాడుతున్న. పని ఎక్కువై అలసిపోతే జ్వరం వస్తది. డాక్టర్ వద్దకు వెళ్లి చిక్తిత్స తీసుకుంటే నయమవుతది. నెలకు మందులకు రూ.5 వేలు ఖర్చవుతున్నాయి. అప్పటి సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతోనే నా ప్రాణాలు దక్కాయి.
– భార్యాపిల్లలతో నాగరాజు

కిడ్నీతో పునర్జన్మ