
ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్‌డ్రిల్
● విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
జ్యోతినగర్(రామగుండం): అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం అన్ని వేళలా సన్నద్ధంగా ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని ఎన్టీపీసీ ప్రాజెక్టులోని భద్రత సిబ్బందితో శుక్రవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలో ముందస్తుగా మాక్‌డ్రిల్ నిర్వహించామని అన్నారు. ప్రాజెక్టులో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు వాటిల్లితే ఎలా వ్యవహరించాలనే అంశాలపై రక్షణ దళాలు అప్రమత్తమవుతాయని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రక్షణ నిమిత్తం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు, అక్కడ ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా దళాలు స్పందించాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్, సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ ఎస్.ఆంజనేయరాజు, ఓవీకేశాస్త్రి, కన్వర్, అసిస్టెంట్ కమాండెంట్ ఆకేశ్వర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్‌డ్రిల్

ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్‌డ్రిల్

ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్‌డ్రిల్

ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్‌డ్రిల్