
గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్‌రూరల్: ప్రభుత్వం మైనార్టీ గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ గురుకులాల పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ డాక్టర్ కనపర్తి సురేశ్ కోరారు. శుక్రవారం కరీంనగర్‌లోని అస్లాం మజీద్ వద్ద మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలపై ఉపాధ్యాయులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలు అందరితో సమానంగా విద్యారంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో గురుకులాలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నుంచి కొత్తగా 8వ తరగతి నుంచి ఐఐటీ, నీట్ పౌండేషన్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ మహేందర్, రాజు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.