
సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి రెవెన్యూ చట్టం, 2025కు గా నూ రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఈ లైసె న్స్‌డ్ సర్వేయర్లను జిల్లాల్లో నియమిస్తారని తెలి పారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ ప్రచురించిందని తెలిపారు. ఈ నెల 5నుంయి 17వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుందని పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 26నుంచి జులై 26వరకు (50 పని దినాలు) శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి సహాయంతో ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సర్వేయర్ల శిక్షణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.