
అసంపూర్తిగా అండర్‌బ్రిడ్జి నిర్మాణం
● బ్రిడ్జిలోకి చేరుతున్న మురికి నీరు
● ఇబ్బంది పడుతున్న వాహనదారులు
● నిర్మాణ పనులు త్వరితగతిన
చేపట్టాలని స్థానికుల వినతి
రాజంపేట: మండలంలోని తలమడ్ల గ్రామ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి సుమారు రెండున్నర సంత్సరాలు కావస్తున్నా పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. అండర్ బ్రిడ్జి పరిధిలోని గ్రామ డ్రైనేజీ తొలగిపోవడంతో మురికి నీరంతా బ్రిడ్జిలోకి చేరి వాహనదారులకు ఇబ్బందకరంగా మారింది. మరో వైపు మిషన్ భగీరథ పైపు లైన్ పనులు కొనగసాగుతుండటంతో వాహనదారులకు మరింత ఇబ్బందికరంగా మారింది.
అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే..
కాంట్రాక్టర్, స్థానిక గ్రామ పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఇబ్బంది తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో నిత్యం నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.