
‘జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం’
పిట్లం(జుక్కల్): జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. మద్దెలచెర్వు గ్రామానికి చెందిన దత్తురెడ్డి(37) ఇటీవల గుండెపోటుతో మరణించారు. సోమవారం మద్దెలచెర్వు గ్రామానికి మంత్రి కోమటిరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్లగొండలో సుధీర్ఘకాలం పని చేసిన దత్తురెడ్డి జిల్లా అభివృద్ధికి తన కథనాల ద్వారా ఎంతో సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, పట్లోళ్ల సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే దత్తురెడ్డి కుటుంబ సభ్యులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.