
రోడ్లపై కేజ్‌వీల్స్‌తో నడిపితే రూ.25 వేల జరిమానా
భిక్కనూరు: ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లను నిర్మింపజేస్తుంటే కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కేజ్‌వీల్స్ వాహనాలను నడిపిస్తూ రోడ్లను నాశనం చేయడం తగదంటూ భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. గురువారం వీడీసీ అధ్యక్షుడు కొండ సిద్దరాములు ఆధ్వర్యంలో సమావేశమైన గ్రామస్తులు కేజీవీల్స్‌తో ఎవరైనా ట్రాక్టర్‌ను రోడ్డుపై నడిపితే రూ.25 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ట్రాక్టర్ కేజ్‌వీల్స్‌తో రోడ్డుపై నడిపించినట్టు సరైన రుజువులతో నిరూపిస్తే వారికి రూ.2 వేల నగదు బహుమతి అందించాలని తీర్మానించారు. నేతలు హరిశ్చంద్రారెడ్డి, భీంరెడ్డి, కుంట లింగారెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్, రాజు, రాజయ్య, ధర్మయ్య, రవి, నర్సయ్య, భూమాగౌడ్, సిద్దరాములు, సంజీవ్, శ్రీకాంత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సమావేశమైన గ్రామస్తులు