
అనధికార మద్యం అపాయకరం
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి లావణ్య
రాజమహేంద్రవరం రూరల్: లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అనధికార (లైసెన్స్ లేని) వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయడం చాలా అపాయకరమన్నారు. అటువంటి మద్యం నకిలీది కావచ్చన్నారు. వివాహాలు, పార్టీలు లేదా ఇతర సామూహిక వేడుకల సందర్భాల్లో మద్యాన్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తామంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. వారు సరఫరా చేసే నకిలీ మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చన్నారు. అటువంటి అనుమానిత వ్యక్తుల వివరాలను వెంటనే ఎకై ్సజ్ శాఖకు తెలియజేయాలన్నారు. ట్రోల్ ఫ్రీ నంబరు 14405కి కానీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి 96767 14547 నంబర్‌కు కానీ తెలపాలని కోరారు.