
మూడేళ్లు దాటుతున్నా..
జాతీయ రహదారి 216ఏలో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్ 22న పనులు మొదలు కాగా, ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని మోరంపూడి వద్ద ఫ్లెఓవర్ కూడా జొన్నాడతో పాటు ప్రారంభించారు. ఇప్పటికే మోరంపూడి ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా, జొన్నాడ మాత్రం బాలారిష్టాలు దాటడం లేదు. పిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిపై గెడ్డర్లు, శ్లాబ్ వేయాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు. అప్రోచ్ నిర్మాణం కోసమని పి.గన్నవరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తే, అక్రమార్కులు తవ్వకాలు చేసి కాసులు దండుకున్నారు. నిర్మాణ పనుల వల్ల జొన్నాడ సెంటర్‌లో నిత్యం ట్రాఫిక్ స్తంభించి, ఇటు రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు.