
సమాజానికి స్వచ్ఛమైన రాజకీయాలు అవసరం
పెద్దాపురం: సమాజానికి సూర్యారావు లాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ఎంతో అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్, సీపీఎం నేత యాసలపు సూర్యారావు వర్ధంతి సభ ఆ పార్టీ మండల కార్యదర్శి డి.క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిపరులను పార్టీలోకి తీసుకుంటుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మూడుసార్లు రాష్ట్ర పర్యటన చేసినా ఆంధ్రాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను భారీగా పెంచిందన్నారు. తొలుత సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.బేబీరాణి, రాజశేఖర్, పలివెల వీరబాబు, నీలపాల సూరిబాబు, సిరపురపు శ్రీనివాస్, కేదారి నాగు, వీర్రాజు, కృష్ణ, గడిగట్ల సత్తిబాబు, స్నేహ, అప్పన్న, సిరిపురపు బంగార్రాజు, మంతెన సత్తిబాబు, మాగాపు నాగు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం, అమృత, నమ్రత తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పెద్దాపురం
మరిడమ్మ జాతర
పెద్దాపురం: కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, ఏటా 37 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 31 వరకూ ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మంగళవారం రాత్రి 8.08 గంటలకు జాతర ప్రారంభమవుతుందన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 335 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 335 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.పెద్దిరాజు, ఎస్‌ఎస్‌ఏ పీఓ వేణుగోపాలరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్‌లైన్ సమస్యల వంటి అంశాలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీదారులు పీజీఆర్‌ఎస్‌లోనే కాకుండా మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
భీమేశ్వరాలయ అన్నదాన
ట్రస్ట్‌కి రూ.5 లక్షల విరాళం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సమాజానికి స్వచ్ఛమైన రాజకీయాలు అవసరం

సమాజానికి స్వచ్ఛమైన రాజకీయాలు అవసరం