
ఉప్మా... ఇదేంటి చెప్మా!
పిఠాపురం: ఈ వంటకం చూస్తే.. ఇదేదో కొత్త పాయసం అనుకుంటే పొరబడినట్టే. ఇది సర్కారు బడిలో వడ్డించిన ఉప్మా. అయ్య బాబోయ్.. ఇదేంటి అనుకుంటున్నారా! నిజమేనండోయ్... పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు అల్పాహారంగా ఈ నీళ్ల ఉప్మా శనివారం వడ్డించారు. యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఉప్మా నీళ్ల మాదిరిగా ఉండడంతో పాటు ఉండలు కట్టి ఎక్కడి నూక కనిపించడంతో విద్యార్థులు పాడేశారు. మధ్యాహ్న భోజనం సైతం నాసిరకంగా ఉండడంతో విద్యార్థులు ఆకలితో ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.

ఉప్మా... ఇదేంటి చెప్మా!

ఉప్మా... ఇదేంటి చెప్మా!