
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాడూరు: రెండు బైక్‌లు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జగపతిరెడ్డి (55) శుక్రవారం పని నిమిత్తం ఇంటినుంచి బైక్‌పై బయల్దేరాడు. కల్వకుర్తి రహదారిలో పెట్రోల్‌బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టడంతో కిందపడిపోయిన జగపతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.