
జీవనాధారాన్ని కోల్పోయారు..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అన్‌మ్యాన్ హెల్పర్ గట్ల కరుణాకర్‌రెడ్డి గత గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి విద్యుత్ మోటా రు స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సుమా రు 25ఏళ్లనుంచి ఆయన ఈదులపూసపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కుమారుడు మానుకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్ద కరుణాకర్ రెడ్డి అకాల మరణంతో ఆ బాధ్యతలన్నీ భార్య ప్రియాంక మీదనే పడ్డాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారనుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

జీవనాధారాన్ని కోల్పోయారు..