
‘ముక్త్ భారత్ అభియాన్’ను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఊర్వశి బీ సింగ్ ఆదేశించారు. ముక్త్‌భారత్ అభియాన్‌పై కలెక్టర్లతో గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డాక్టర్ ఊర్వశి బీ సింగ్‌మాట్లాడారు. టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. రోగులకు నిరంతర వైద్యసేవలు అందిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 95,669మంది అనుమానితులను గుర్తించి ఇప్పటివరకు 6,991 మందికి స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. టీబీ నిర్ధారణకు అవసరమైన ఎక్స్‌రే యంత్రాలను ఏర్పాటు చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు అందుబాటులో ఉండేలా ఆర్ బీఎస్‌కే వాహనాలను వినియోగిస్తామని వివరించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు.