
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
కాటారం: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అంది స్తూ విద్యావిధానం మెరుగుపర్చడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సూచించారు. మండలంలోని దేవరాంపల్లి, విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలను బుధవారం డీఈఓ తనిఖీ చేశారు. పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు. భోదన విధానం తదితర అంశాలను పరిశీలించారు. ఈ విద్యాసంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, విద్యార్థుల నమోదు, ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ యాప్‌పై చర్చించి మధ్యాహ్న భోజన అమలు తీరుపై పర్యవేక్షించారు. ప్రాథమిక స్థాయిలో మౌళిక, గణిత సామర్థ్యాల సాధన, ఉన్నత పాఠశాలలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయానుకూలంగా విధులకు హాజరై విద్యార్థులకు ఉత్తమ భోదన చేయాలని ఆదేశించారు. డీఈఓ వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.
పాఠశాలను సందర్శించిన డీఈఓ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలను డీఈఓ రాజేందర్ బుధవారం సందర్శించారు. ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, విద్యార్థుల నమోదు, ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ యాప్, మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. ప్రాథమిక స్థాయిలో మౌలిక గణిత సామర్థ్యాల సాధన ఉన్నత పాఠశాలలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అమలు తీరును ఆయన పర్యవేక్షించారు. ఉపాధ్యాయులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయనవెంట ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రాజేందర్, శ్యామ్ తదితరులు ఉన్నారు.
డీఈఓ రాజేందర్