
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అంబేడ్కర్ సెంటర్ నుంచి జంగేడు వరకు రోడ్డు వెడల్పు, డ్రెయినేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు రూ.4కోట్ల నిధులు మంజూరైనట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిధులు కావాలని కోరగా సీఎస్‌ఆర్ నిధుల నుంచి వెంటనే రూ.4కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, సింగరేణి సంస్థకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణంతో భూపాలపల్లి జంగేడు రోడ్డుకు ప్రత్యేక శోభ వస్తుందని, పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి