
హన్మకొండ: గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు 12 నెలల జీతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చిత్రపటానికి ఆ ఉపాధ్యాయులు క్షీరాభిషేకం చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా సంవత్సరానికి 9 నెలలు మాత్రమే జీతం ఇచ్చే వారన్నారు. తమ పోరాటాలు, వినతులకు ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. కార్యక్రమంలో గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భూక్యా తిరుపతి, ఉపాధ్యాయులు లావుడియా హరిలాల్, లక్ష్మణ్, పార్వతి బాయి, సుజాత, శ్రీరామ్, లత, కల్పన, తిరుపతి, రాజన్న పాల్గొన్నారు.