● ఘనంగా సీతారాముల కల్యాణం
భూపాలపల్లి అర్బన్: సీతారాముల కల్యాణం గురువారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయాలు, హన్‌మాన్ దేవాలయాల్లో వేద పండితులు కల్యాణం ఘనంగా జరిపించారు. జిల్లాకేంద్రంలోని కోదండ రామాలయం, శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయాల్లో జరిగిన కల్యాణానికి వందల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి దంపతులు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం పలువురు అన్నదానం, పులిహోర, రామరసం పంపిణీ చేశారు.