
మాట్లాడుతున్న చైర్‌పర్సన్ వెంకటరాణిసిద్ధు
భూపాలపల్లి: వేసవి కాలంలో మున్సిపాలిటీలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరగా..కొత్త బోర్లు వేయడం, పాత బోర్ల మరమ్మతులకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అవినాష్, వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.