
గిరిజనుల వికాసానికే పథకాలు
రాయికల్: గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. మండలంలోని దావన్‌పల్లి గురువారం పీఎంధర్తీఆబాజాన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో దావన్‌పల్లి, బోర్నపల్లి గ్రామాలు ఎంపికయ్యాయని, ఒకేరోజు 20 శాఖల అధికారులు వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని దరఖాస్తులు స్వీకరిస్తారని, అర్హులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు.