వ్యోమగాములకు తప్పని క్వారంటైన్‌

Astronauts Experience Quarantine After Apollo 11 Mission - Sakshi

వాషింగ్టన్‌: కోవిడ్‌ -19 దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మానవ జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. కోవిడ్‌ -19 పుణ్యమా ... క్వారంటైన్‌, సోషల్‌ డిస్టన్స్‌, లాక్‌డౌన్‌, వంటి పదాలు మన జీవితంతో భాగమయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కచ్చితంగా క్వారంటైన్‌ చేయాల్సి వచ్చేది. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారినే క్వారంటైన్‌ చేశారనుకుంటే మీరు పొరపడినట్లే..! చంద్రునిపై 1969లో మొదటిసారిగా కాలుమోపిన ఆస్ట్రోనాట్స్‌ కూడా క్వారంటైన్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖగోళయాత్ర చేసి తిరిగి భూమి పైకి వచ్చిన ఆస్ట్రోనాట్స్‌ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైఖేల్‌ కొలిన్స్‌, ఎడ్విన్‌ బజ్‌ అల్ర్ర్డిన్‌ వ్యోమగాములను 21 రోజులపాటు క్యారంటైన్‌లో ఉంచారు. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ముప్పైతొమ్మిదో పుట్టినరోజు వేడుకలను కుటుంబానికి దూరంగా ఉండి జరుపుకున్నాడు. క్వారంటైన్‌ మనకు కొత్తగా ఉన్న , వ్యోమగాములకు మాత్రం సాధారణమే.

క్వారంటైన్‌ ఎందుకు ఉండాల్సివచ్చిందంటే...
అపోలో-11 మిషన్ వ్యోమగాములు చంద్రునిపై ఉన్న  వాతావరణం, లూనార్‌ పదార్థాలతో మొదటిసారిగా గడిపారు.వ్యోమగాములను చంద్రునిపై ఉన్న హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ వారు అక్కడి వాతావరణానికి బహిర్గతమైతే అది భూమిపై ఉన్న మానవాళికి విపత్తుగా మారుతుంది.దీంతో ఖగోళయాత్ర అనంతరం ముగ్గురు వ్యోమగాములను క్వారంటైన్‌లో ఉంచారు.  వారిని వైద్యులు నిశితంగా పరిశీలించారు.మరొక బృందం అపోలో-11 మిషన్  తీసుకొచ్చిన రాళ్లు, ధూళిని పరీక్షించి అధ్యయనం చేశారు.

చంద్రునిపై తెలియని అంశాలు , హానికరమైన బ్యాక్టీరియాను పక్కన పెడితే, వ్యోమగాములు చంద్ర నమూనాలను సేకరించినప్పుడు వారికి తెలియకుండానే తీసుకువచ్చే అంశాలు వారి జీవితాన్ని భంగం కలిగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అపోలో -12 , అపోలో -14 మిషన్లకు మూన్‌ ల్యాండింగ్ తరువాత తిరిగివచ్చే  వ్యోమగాములకు క్వారంటైన్‌ కొనసాగింది. కొన్నిరోజుల తరువాత అపోలో ప్రోగ్రాం తదుపరి మిషన్ల వ్యోమగాములకు క్వారంటైన్‌ కొనసాగలేదు ఎందుకంటే అంతరిక్షంలో ప్రమాదకరమైన అంశాలు లేవని పరిశోధకులు  భరోసా ఇచ్చిన వెంటనే క్వారంటైన్‌ను నిలిపివేశారు.‘అపోలో 11: క్వారంటైన్‌’ అనే డాక్యుమెంటరీ మార్చి 6 న ప్రముఖ ఆంగ్ల చానల్‌లో ప్రసారమయ్యింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top