గిది అన్నమేనా? | Sakshi
Sakshi News home page

గిది అన్నమేనా?

Published Wed, Mar 6 2024 7:50 AM

- - Sakshi

ఉడికీ ఉడకని అన్నం, రుచీశుచీ లేని కూరలు..నీళ్ల చారు..వండామా పెట్టామా అన్నరీతిలో నిర్లక్ష్యం..వెరసి విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పీజీ, డిగ్రీ కోర్సులు చదువుతున్న తాము ఇంత అధ్వానపు తిండి తిని ఎలా బతికేదని తిరగబడ్డారు. బషీరాబాగ్‌లోని నిజాం కళాశాల వసతి గృహంలో నాసిరకం ఆహారం పెడుతున్నారని మంగళవారం విద్యార్థులు నిరసనబాట పట్టారు. ఏకంగా అన్నం, కూర గిన్నెలను హాస్టల్‌ ఎదురుగా ఉన్న రహదారిపైకి తీసుకువచ్చి బైఠాయించారు. ఎన్నిమార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా స్పందించకపోవడంతోనే తాము రోడ్డెక్కామని తెలిపారు. చివరగా పోలీసులు వచ్చి విద్యార్థులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. – గన్‌ఫౌండ్రీ

1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement