సూర్యప్రభ వాహనంపై గోవిందుడు | Sakshi
Sakshi News home page

సూర్యప్రభ వాహనంపై గోవిందుడు

Published Wed, May 29 2024 4:10 PM

సూర్యప్రభ వాహనంపై గోవిందుడు

జమ్మలమడుగు: నారాపురస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సతీసమేతంగా వేంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సూర్యప్రభ వాహానంపై పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ముందు కోలాటం ఆడుతూ, అన్నమయ్య కీర్తనలు పాడుతూ పారవశ్యంతో నృత్యాలు చేశారు. దేవదేవుడు తమ ఇళ్లముందు నుంచి వెళుతుండటంతో ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రథోత్సవం అనంతరం ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం స్వామిదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాయంత్రం స్వామి వారు చంద్ర ప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

నేడు చక్రస్నానం...

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుచ్చి వసంతోత్సవం, చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement