ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ | Sakshi
Sakshi News home page

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ

Published Wed, May 29 2024 4:10 PM

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి విమర్శించారు. మంగళవారం నగరంలోని హోచిమిన్‌ భవన్‌లో ఏఐటీయూసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎ స్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముని విగ్రహాన్ని టెంట్‌లో వేస్తారని చెప్పడం ప్రధానికి తగునా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు మోదీకి వంతపాడుతున్నాయన్నారు. దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని దీన్ని పక్కదారి పట్టించేందుకు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్‌టీ రామారావు లౌకిక వ్యవస్థకు మద్దతుగా నిలిచారన్నారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి కూడా లౌకిక వ్యవస్థ పరిరక్షణకు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు లింగన్న, ఆర్‌.బాబు, నాగిరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement