ప్రజాసేవ కోసం ఉద్యోగానికి రాజీనామా..
మరిపెడ రూరల్: ప్రజా సేవ చేయలనే దృఢ సంకల్పంతో ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. విషయం తెలియగానే గ్రామానికి చెందిన రాములమ్మ అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగానికి మరో 8 ఏళ్లు సర్వీస్ ఉన్నట్లు ఆమె తెలిపారు. కాగా, ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెను గ్రామస్తులు అభినందించారు.
గాలివారిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా రాములమ్మ నామినేషన్ దాఖలు


