ఆ వృద్ధుడు.. పట్టు వదలని విక్రమార్కుడు
మరిపెడ రూరల్: ఏడు పదుల వయస్సులో కూడా ఓ వృద్ధుడు పట్టు వదలని విక్రమార్కుడిలా సర్పంచ్ పదవికి సై అంటున్నాడు. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. తన నిర్ణయాన్ని గ్రామస్తులు కూడా అంగీకరించారు. ఆయనే మండలంలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ తేజానాయక్. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్‌గా కావాలనే తన కోరికను గ్రామస్తులకు తెలుపగా వారు అంగీకరించారు. అదేవిధంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రెండున్నర గుంటల స్థలం, భవనానికి దారి, ఖర్చులకు రూ.2 లక్షలు నగదును తాయిలాలుగా ప్రకటించాడు. ఇంకేముంది గ్రామస్తులంతా ఏకగ్రీవానికి మద్దతు తెలపడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.
ఏడు పదుల వయస్సులో కూడా
సర్పంచ్ పదవికి నామినేషన్
ఏకగ్రీవం వైపుగా అడుగులు


