గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

Published Thu, Mar 27 2025 1:13 AM | Last Updated on Thu, Mar 27 2025 1:13 AM

గురువ

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

అందినకాడికి దండుకునుడే!

2019 నుంచి టీఎస్‌–బీపాస్‌ అమల్లోకి వచ్చింది. భవన నిర్మాణాలకు ‘ఆన్‌లైన్‌’ ద్వారా మాత్రమే అనుమతులు పొందాలి. కానీ.. కొంత మంది ప్లాన్‌లు ఒక రకంగా సమర్పించి, మరో రకంగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ భవన నిర్మాణాల వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నగర ప్రణాళిక విభాగం సిబ్బందికి నడుమ కార్పొరేటర్లు లేదా లైసెన్స్‌ సర్వేయర్లు దళారులుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో స్థలం ఎంతో ఖరీదు కావడంతో ఉన్న కొద్దిపాటి స్థలంలో నిబంధనల ప్రకారం భవనం చుట్టూ నిర్దేశిత ఖాళీ వదిలి నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్న నిర్మాణాలు అవినీతి అధికారులకు, దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ వాటాలు తమకు అందిస్తే సెలవు రోజుల్లో అక్రమ కట్టడాలు, నిర్మాణాలు సాగించాలనే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నట్లు సమాచారం.

‘గ్రేటర్‌’లో యథేచ్ఛగా అనధికారిక భవన నిర్మాణాలు

భద్రకాళి ఆలయ హుండీ

ఆదాయం రూ.14,97,412

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కించారు. రూ.14,97,412 ఆదాయం లభించినట్లు నగదును యూనియన్‌ బ్యాంకులో జమ చేసినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. విదేశీ కరెన్సీ 14 డాలర్లు, 10 ఇంగ్లండ్‌ పౌండ్స్‌, 5 యూఏ దిరమ్స్‌, 10 యూరోలు లభించినట్లు తెలిపారు. లెక్కింపులో పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ పరిశీలకులు డి.అనిల్‌కుమార్‌ వ్యవహరించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పర్యవేక్షకులు విజయ్‌కుమార్‌తోపాటు ఆలయ సిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్‌, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు 130 మంది లెక్కింపులో పాల్గొన్నారు.

నేటినుంచి బాటనీ,

జువాలజీ మూల్యాంకనం

విద్యారణ్యపురి: ఈనెల28నుంచి నిర్వహించాల్సిన ఇంటర్‌ బాటనీ, జువాలజీ సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని గురువారం(27వ తేదీ)నుంచి చేపడుతున్నట్లు స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌ ఆఫీసర్‌, డీఐఈఓ గోపాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కాలేజీ యాజమాన్యాల అధ్యాపకులను రిలీవ్‌ చేసి మూల్యాంకనానికి విధిగా పంపాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

కొనసాగుతున్న టెన్త్‌ పరీక్షలు

విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హనుమకొండ జిల్లాలోని 67కేంద్రాల్లో నిర్వహించిన మ్యాథ్స్‌ పరీక్షలో ఆరుగురు విద్యార్దులు గైర్హాజరైనట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. మొత్తంగా 12,016 మంది విద్యార్థులకుగాను 12,010 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలో 49 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలో 15మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 9,265మంది విద్యార్థులకుగాను 9,250మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.

దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో

9మంది డీబార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో బుధవారం కాపీయింగ్‌ చేస్తూ 9మంది విద్యార్థులు పట్టుబడ్డారని, వారిని డీబార్‌ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌కాలేజీ సెంటర్‌లో ఇద్దరు, వరంగల్‌ ఎల్‌బీ కాలేజీలో ఒకరు, ఏఎస్‌ఎం కాలేజీలో ఆరుగురు పట్టుబడినట్లు పేర్కొన్నారు.

ఐదు అంతస్తుల భవనం. ఏడాదిగా నిర్మాణం.. లక్షల్లో ఖర్చు.. క్షణాల్లో ఫట్టుమని కూలిపోయింది. కొంత మంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం జరిగిన ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా భయకంపితుల్ని చేసింది. ఏజెన్సీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన, నిబంధనలు పాటించని భవనాలు అనేకం. భద్రాద్రి తరహాలో మన దగ్గర కూడా ఇలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

నిర్మాణాలు ఎక్కడెక్కడంటే..

ట్రైసిటీ శివారు ప్రాంతాల్లో, వీలీన గ్రామాల్లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలోని కాజీపేట, హంటర్‌ రోడ్డు, నందిహిల్స్‌, కుమార్‌పల్లి, కరీమాబాద్‌ తదితర పాంతాల్లో అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే ఏరియాల్లో, వ్యాపారాలు సాగే ఏరియాల్లో అనధికారిక అంతస్తులు పెరిగిపోతున్నాయి. డీవియేషన్లు, సెట్‌బ్యాక్‌లు, అదనపు అంతస్తుల నిర్మాణం, పెంట్‌ హౌజ్‌లు తదితర అంశాలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఫైర్‌ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు పెరిగిపోతున్నాయి.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరంలో యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. కొంత మంది కార్పొరేటర్లు, క్షేత్ర స్థాయి బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లు చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు అనుమతులిప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. నోటీసులిస్తూ, కూల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. అందినకాడికి దండుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. బల్దియాకు ఫీజులు చెల్లించకుండానే భారీ భవంతులు కట్టుకోవడం నగరంలో సర్వసాధారణమైంది.

వినకపోతే బెదిరింపులే..

నగర ప్రణాళికా విభాగంలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, రెవెన్యూ సిబ్బంది డ్యాకుమెంటరీ, ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నారు. వీరు అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లుగా వ్యవహరించకపోతే బదిలీలు తప్పవని కొంత మంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎందుకంటూ క్షేత్ర స్థాయిలో ఆయా విభాగాల అధికారులు లైసెన్స్‌ సర్వేయర్లు, చైన్‌మెన్ల ద్వారా కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా, అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో బల్దియాకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది.

టాస్క్‌ఫోర్స్‌ పాత్ర నామమాత్రమే..

నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారికి కొత్త చట్టంతో చెక్‌ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలో రెండు వేర్వేరు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేశారు. కానీ.. ఈ బృందాల పాత్ర నామ మాత్రమే. ఎవరైనా పదేపదే ఫిర్యాదు చేస్తేనే నోటీసులు జారీ చేస్తున్నారు. ఏమైనా ఒత్తిళ్లు వస్తే వెనక్కి తగ్గుతున్నారు. ఎలాంటి పరపతి లేని మధ్య తరగతి వర్గాల ఇళ్లపై కూల్చివేతలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నగరంలో అనుమతి లేని, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అనుమతి లేకుంటే అదనపు పన్ను

భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే భవనాలు నిర్మించాలి. అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రెండు వందల శాతం ఆస్తి పన్ను భవన జీవిత కాలం చెల్లించాలి. అక్రమ నిర్మాణాలను కట్టడి చేస్తున్నాం.

– రవీందర్‌ వాడేకర్‌,

బల్దియా ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌

కార్యాలయంలో ఖాళీగా ఉన్న

సబ్‌ రిజిస్ట్రార్‌ చాంబర్‌

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్న

డాక్యుమెంట్‌ రైటర్‌

వరంగల్‌ ఆర్వో సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయంలో వింత పోకడ

దస్తావేజులకు భద్రత ఏది?

అనుమతులకు

సర్వేయర్లే దళారులు!

మితిమీరి జోక్యం చేసుకుంటున్న

కార్పొరేటర్లు

కాసులకు కక్కుర్తి పడి

కళ్లు మూసుకుంటున్న

టౌన్‌ప్లానింగ్‌ యంత్రాంగం

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న

ఉన్నతాధికారులు

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20251
1/3

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20252
2/3

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20253
3/3

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement