రేపు ‘నిధి ఆప్కే నికట్‌’ | - | Sakshi
Sakshi News home page

రేపు ‘నిధి ఆప్కే నికట్‌’

Published Wed, Mar 26 2025 1:07 AM | Last Updated on Wed, Mar 26 2025 1:09 AM

హన్మకొండ అర్బన్‌ : ఈపీఎఫ్‌ఓ సభ్యులు, య జమానులు, పెన్షనర్ల ఫిర్యాదులు పరిష్కరించడానికి ఈనెల 27న (గురువారం) నిధి ఆప్కే నికట్‌ 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు వరంగల్‌ రీజియన్‌ అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి వరంగల్‌లోని వైభవ్‌ లక్ష్మి షాపింగ్‌ మాల్‌, హనుమకొండలోని గ్రీన్‌వుడ్‌ హైస్కూల్‌, తొ ర్రూరులోని సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌, జనగామలోని శాన్‌ మారియా హైస్కూల్‌, భూపాలపల్లిలోని ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌, ములుగులోని శ్రీ అరవింద ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని మమత హాస్పిటల్‌ రోడ్డులో గల ఎస్‌బీఐటీ కళాశాల, ఇల్లందులోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణతో పాటు పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పీఎఫ్‌ సభ్యులు, పెన్షనర్లు సద్వినియోగించుకోవాలని సూచించారు.

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

రూ.2.39లక్షల విలువైన సొత్తు అపహరణ

ఖిలా వరంగల్‌: వరంగల్‌ కరీమాబాద్‌లో తాళం వేసి ఊరెళ్లిన ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రూ.2.39లక్షల విలువైన సొత్తు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి గంజి శ్యాం మోహన్‌, స్వర్ణలత దంపతులు ఈ నెల 17న ఇంటికి తాళంవేసి హైదరాబాద్‌కు వెళ్లారు. హైదరాబాద్‌నుంచి మంగళవారం మధ్యాహ్నం కరీమాబాద్‌లోని ఇంటికి చేరగా.. తాళం తీసి ఉండటంతో చోరీ చేసి ఉంటారని గ్రహించి వెంటనే ఆయన మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. బీరువాలో దాచిన బంగారు గొలుసు 24గ్రాములు, మాటీలు నాలుగు గ్రాములు, ఉంగరం 3గ్రాములు, 5గ్రాముల బంగారు నాణెం.. మొత్తం 36 గ్రాముల బంగారం పాత విలువ ప్రకారం రూ.1 44 లక్షలు, వెండి పట్టిలు 150 గ్రాములు, రూ.80వేలు చోరీకి గురైనట్లు బాధితుడు శ్యాం మోహన్‌ ఫిర్యాదులో తెలిపారు. మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం తెలిపారు.

పెట్రేగి పోతున్న గిరిగిరి వ్యాపారులు

బాకీ ఇవ్వలేదని భౌతికదాడి

వరంగల్‌: వరంగల్‌లో గిరిగిరి వ్యాపారులు పెట్రేగి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గిరిగిరిలో తీసుకున్న డబ్బుల్లో కొంత బకాయి ఇవ్వలేదనే కోపంతో తాజాగా బకాయిదారుడిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. కాశిబుగ్గలోని ఓ ప్రైవేట్‌ వైద్యుడు ఓ గిరిగిరి వ్యాపారి వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుని వాయిదాలు చెల్లించగా రూ.9వేలు బకాయి పడినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వ్యాపారి కుమారుడు పలుమార్లు వైద్యుడి వద్దకు వచ్చి బకాయిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయినా సదరు వైద్యుడు స్పందించపోవడంతో వ్యాపారుడి కుమారుడు ఇంతేజార్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు వైద్యుడికి ఫోన్‌ చేసి అప్పు చెల్లించాలని సూచించిగా నేను ఏసీపీ వద్దకు వస్తాను. అక్కడ తేల్చుకుంటానని చెప్పడంతో పోలీసులు మిన్నకుండి పోయి ఈవిషయం ఫిర్యాదు చేసిన వారికి తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి కుమారుడు తన మిత్రులతో కలిసి రెండు రోజుల క్రితం వైద్యుడిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. అయితే అప్పు ఇవ్వకుంటే దాడికి పాల్ప డం సరికాదని స్థానికులు అంటున్నారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement