● నేడు హుండీ లెక్కింపు
హసన్‌పర్తి : ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఎర్రగట్టు దేవాలయం నుంచి స్వామివారిని రథాలపై ప్రతిష్ఠించి భారీ ప్రదర్శన చేపట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ వైస్ ఎంపీపీ నమిండ్ల రాజేశ్వరి దంపతులు స్వామివారికి మొక్కులు సమర్పించారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఈఓ వెంకట్రామ్, కనపర్తి రాజు, సంగాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నేడు (బుధవారం) హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు కమిటీ చైర్మన్ తెలిపారు.
వైద్యపరికరాలు అందించడం అభినందనీయం
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్ బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా సంస్థ ప్రతినిధి సుధా జిజారియా అందించిన రేడియంట్ వార్మర్స్, ఫొటోథెరపీ వైద్యపరికరాలను మంగళవారం వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఈ వైద్య పరికరాలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఫౌండేషన్ ప్రతినిధి సుధా జిజారియాలకు ఎంజీఎం వైద్యాధికారులు మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ అపర్ణ, ప్రొఫెసర్ అలిమేను, ఆర్‌ఎంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల ఓట్లు
ఒకే బూత్‌లో ఉండాలి
వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు అన్ని ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,72,824 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఎలక్షన్ డీటీ రంజిత్, రాజకీయ పార్టీల నాయకులు ఈవీ.శ్రీనివాసరావు, బాకం హరిశంకర్, కె.శ్యాం, ఫిరోజుల్లా, జె.అనిల్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలి
వరంగల్: ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలని మార్కెటింగ్‌శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నపూర్ణ క్యాంటీన్‌లో ఇప్పటివరకు అందజేస్తున్న వెయ్యి భోజనాలను రెండు వేలకు పెంచాలని చాంబర్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాలు, అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ఆర్‌జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, ఏఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘ఎర్రగట్టు’ బ్రహ్మోత్సవాలు
ముగిసిన ‘ఎర్రగట్టు’ బ్రహ్మోత్సవాలు