గుంటూరు లీగల్: భూవివాదం నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా కారు నడిపి ఇద్ద రి మరణాలకు కారణమైన ఘటనలో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు. కోర్టు వర్గాలు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, నెక్కలు గ్రామం ప్రధాన రోడ్డుపై 2019 ఏప్రిల్ 5వ తేదీన భూ వివాదాల నేపథ్యంలో పసుపులేటి చిన్న బాపయ్య కుటుంబ సభ్యులపై కరల్రు, చేతులు, కాళ్లతో పలువురు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా నిందితులు బాధితులపై ఉద్దేశపూర్వకంగా కారు నడపడంతో పసుపులేటి మహాలక్ష్మి(74), పసుపులేటి వీరకుమారి (34) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు పసుపులేటి చిన బాపయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు విచారణ.. అనంతరం ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 అలూరి సుధాకర్‌కు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ. 11వేలు జరిమానా, ఏ2 అలూరి అజయ్‌కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3వేలు జరిమానా, ఏ4 యరమ్రాసు శ్రీనివాసరావుకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేలు జరిమానా విధించారు. ఈ క్రమంలో ఏ3, ఏ5, ఏ6 లపై నేరం రుజువు కానందున నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ కేసులో స్పెషల్ పీపీపీ టి.దుర్గాప్రసాద్ బాధితుల తరఫున వాదనలు వినిపించారు. నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
బాలికల హ్యాండ్ బాల్ విజేత పశ్చిమ గోదావరి
పిడుగురాళ్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ అండర్ –15 బాలికల విబాగం విజేతగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నిలిచింది. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో పోటీలు హోరోహోరిగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్‌లో పశ్చిమ గోదావరి, విజయనగర్ జట్లు పోటీ పడ్డాయి. పశ్చిమ గోదావరి విజయం సాధించి మొదటి స్థానంలోను, రెండవ స్థానంలో విజయనగరం, మూడవ స్థానంలో కడప, కర్నూలు జట్లు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు తిరుమల ఆక్స్‌ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు షీల్డ్‌లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
బొల్లాపల్లి: పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవాలను పురస్కరించుకుని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 15 టీంలు పాల్గొన్నాయని, వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగవ స్థానాల్లో బాపట్ల, బేతపూడి, మాచవరం, యడ్లపాడు జట్లు గెలుపొందాయని నిర్వాహకులు కె. ప్రకాష్‌రావు, సీహెచ్ రాజేశ్వరరావులు తెలిపారు. ప్రథమ బహుమతి బాపట్ల జట్టుకు శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ 30,116, ద్వితీయ శివ శక్తి లీలా అంజన్ ఫాండేషన్ రూ. 25,116లు చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెవ ఫాదర్ వై. జాకోబ్ రెడ్డి, జాన్ శేఖర్, గ్రామ సర్పంచ్ కె. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరి మృతికి కారకులైన నిందితులకు జైలు శిక్ష
ఇద్దరి మృతికి కారకులైన నిందితులకు జైలు శిక్ష


